Pages

Wednesday 22 August 2012

విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న పవన్ కొత్త సినిమా



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకి ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. విశ్వసనీయ  సమాచారం ప్రకారం ఈ చిత్ర ఉత్తరాంధ్ర పంపిణీ హక్కులు రికార్డు స్థాయిలో 4 కోట్ల 10 లక్షలకు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏ చిత్రానికి అయినా ఈ ఏరియాలో ఇదే అత్యదిక మొత్తం. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. గబ్బర్ సింగ్ భారీ హిట్ సాధించడం, పవన్ – పూరి కాంబినేషన్ అనగానే అంచనాలు తారా స్తాయిలో ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. పవన్ సరసన తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Tuesday 21 August 2012

మళ్లి వాయిదా పడిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా






పవన్ కళ్యాణ్ రాసుకోమ్మన్నాడు కానీ చెపోద్దు అన్నాడు


పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒకేలా ఉంటాడు ...హిట్ వచ్చిన ఫ్లాప్  వచ్చిన తోనకడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇంకెవరికి లేని విలక్షణ స్వభావం పవన్ కళ్యాణ్ సొంతం. గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ వచ్చిన తరువాత కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన పని లో తాను నిమగ్నమై ఉన్నాడు .

రిలీజ్ అయిన రోజు నుండి ఈరోజు వరకు గబ్బర్ సింగ్ సక్సెస్ గురించీ ఎక్కడ మాట్లాడలేదు. సినిమాలో అలీ తో పవన్ ఎప్పుడు ఒక మాట చెపుతూ ఉంటాడు " అరె సాంబ రాస్కో రా " అని...

గబ్బర్ సింగ్ కలేక్ష న్స్  గురుంచి కూడా అదే చెప్పాడు......కలేక్షన్స్  లెక్కలు రాస్కో కాని బయట కి చెపొద్ధు  అని.....జస్ట్ అలీ ప్లేస్ లో గణేష్ ఉన్నాడు అంతే తేడా.

నేను కాదు సినిమా మాట్లాడాలి ...చుసిన జనం మాట్లాడాలి అని చెప్పే పవన్ ఇప్పటికి అదే నియమానికి కట్టుబడి ఉన్నాడు.  హిట్ వచిందని పొంగలేదు ....ఫెయిలూరు  వచ్చిన కుంగిపోడు.

హరీష్ శంకర్ దర్శకత్వ0 వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బండ్ల గణేష్ పరమేశ్వర  ఆర్ట్స్  బ్యానర్ పై నిర్మించాడు.


Thursday 16 August 2012

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ అరుదైన రికార్డు......




ఈ రోజు విడుదల కానున్న ‘రెబల్’ ఫస్ట్ టీజర్




యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం యొక్క ఫస్ట్ టీజర్ ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం హోటల్ తాజ్ లో జరగనుంది.ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫోటోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ‘రెబల్’ మూవీ యాక్షన్ మరియు డ్రామా కలగలిపిన మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిందారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా కనిపించనున్నారు.
సెప్టెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం కూడా రాఘవ లారెన్స్ గారే అందించారు. జె. భగవాన్ మరియు జె. పుల్లారావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చాలా కాలం చిత్రీకరణలో ఉండటం వల్ల ఈ చిత్ర బడ్జెట్ పెరిగిపోయింది, కానీ ఈ చిత్రం బాగా రావడం మరియు రిలీజ్ కు ముందే మంచి బుజినెస్ జరుగుతుండడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చాలా సంతోషంగా ఉన్నారు.

మాకు అన్నీ ఆయనే నేర్పాడు : కమల్ హాసన్

యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండియాలోనే తనకంటూ ప్రేత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలే జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలకి ముఖ్య అతిధిగా కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వర రావు, కె. బాలచందర్, శారద, ఏడిద నాగేశ్వరరావు మరియు అంబరీష్ లకు జీవితకాలపు సాఫల్య అవార్డులను బహుకరించారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ మా గురువు గారైన కె. బాలచందర్ గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వడమంటే మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డు ఇచ్చినట్టు. అందరూ మాలో ఉన్న ప్రతిభను చూసి బాలచందర్ గారు మమ్మల్ని ప్రోత్సహించి మాతో సినిమాలు తీశారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము నిజం కాదు. మాకు ఆయన అవకాశం ఇచ్చే నాటికి మాకు నటనలో ఓనమాలు కూడా రావు. అలాంటి మమ్మల్ని చేరదీసి ఒక అద్భుతమైన శిలని చెక్కినట్టు చెక్కి ఇంతటి నటులని చేశారు. మాకు ప్రతీ చిన్న విషయమూ నేర్పించి ఇంతటి వారిని చేసినందుకు ఆయనకీ ఎప్పటికీ రుణపడి ఉంటామని’ ఆయన అన్నారు.

సెప్టెంబర్లో రానున్న రజనీకాంత్ తొలి 3డి మూవీ


సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు శ్రియా సరన్ హీరో హీరోయిన్లుగా సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘శివాజీ’ చిత్రాన్ని ఈ సెప్టెంబర్లో 3డి మాయా జాలంలోకి మార్పు చేసి మళ్ళీ ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ మరియు ప్రసాద్ లాబ్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని 3డి లోకి మారుస్తున్నారని మేము ఇది వరకే తెలిపాము. అన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డి వర్షన్ మొదటి కాపీని ఈ రోజు ఉదయం చెన్నైలో ప్రత్యేకంగా మీడియా వారికి ఒక షో వేశారు, ఈ కార్యక్రమానికి రజనీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రం చూసిన వారందరూ సినిమా చాలా బాగుందంటున్నారు మరియు ‘శివాజీ’ చిత్రాన్ని 3డి లో చూస్తుంటే ఒక కొత్త అనుభూతికి లోనయ్యామని చెబుతున్నారు. రజనీకాంత్ కూడా సినిమా చూసిన తర్వాత చాలా ఉత్కంఠతకి లోనయ్యారు మరియు ‘శివాజీ’ చిత్రం మళ్ళీ 3డిలో విడుదలవుతుండడం ఎంతో ఆనందంగా ఉందని, 3డి వర్షన్ కోసం ఎంతో కష్టపడ్డ శంకర్, ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ మరియు ప్రసాద్ లాబ్స్ వారికి అభినందనలు తెలిపారు. 3డిలో వస్తున్న రజనీకాంత్ తొలి చిత్రం ఇది మరియు ఈ చిత్రం తర్వాత సౌందర్య రజనీకాంత్ తీస్తున్న ‘విక్రమ సింహ’ (తమిళంలో కొచ్చాడియాన్) సినిమా కూడా 3డిలో విడుదల కానుంది.

PAWAN KALYAN HAS THE ULTIMATE 'POWER'



Usually producers give token advance to heroes and get their dates. Then they will go in search of director. Sometimes hero will ask the producer to approach particular director. But with Power star Pawan Kalyan he takes the ultimate call about everything! He will finalize the subject first and then fixes the director and finally hands over the project to some 'lucky' producer. 

Pawan Kalyan is currently following this pattern and he believes that it is the best way to build a project. Pawan himself decided to remake Dabangg and he called in Harish Shankar to wield the megaphone and later the project was handed over to Bandla Ganesh. Same happened with Panja and Teenmaar. 

Pawan's next film too has been fixed in the same style. Pawan and Trivikram finalized the subject and later 'roped in' the producer BVSN Prasad. Pawan is also constantly meeting Kona Venkat and few other writers to finalize the subjects. Kona Venkat said that the director isn't finalized yet for the subject that he is preparing for Pawan. Also he is not keen on signing up star directors unless they approach him with storylines. He is more than happy to work with freshers and directors without star value. This is Pawan's style!

Yes he has the ultimate power and he will take care about each and everything in his films.He will try to give a his best at all areas

సందేశాత్మకమైన విషయం తో పవన్, త్రివిక్రమ్ సినిమా......


పవన్ పారితోషికం 15 కోట్లు........


Gabbar Singh Pilla Song With Lyrics



Pilla Video Song Full HD...

Composed by Devi Sri Prasad

Written By : Devi Sri Prasad

Singed by : Vadde palli Srinivas,Pawan Kalyan





Lyrics:


Yee Pilla Atla Navvesesi Paripomakey Babu
Meerentra Nannu Chustannaru
Yevadi Dappu Vaadu Kottandahey...

Ye Gannulanti Kannulunna Junnu Lanti Pilla
Ye Navvu Thoti Nannu pelchi Paripote Yella..
Ye Gannulanti Kannulunna Junnu Lanti Pilla
Ye Navvu Thoti Nannu pelchi Paripote Yella..

Ye Sundari Sundari Sundari
Manasuni Chesinave Isthiri..
StrawBerry BlueBerry BlackBerry Mix Chesi
Lippulo Pettinave French Juice Factory....

Pilla Nuvu Leni Jeevitam
Nalla Rangu Antukunna thella Kaagitham
aha Pilla Nuvu Leni Jeevitam
Avakaya Baddaleni Mandu Kanta Daarunam...

Ye Gannulanti Kannulunna Junnu Lanti Pilla
Ye Navvu Thoti Nannu pelchi Paripote Yella..
Ye Gannulanti Kannulunna Junnu Lanti Pilla
Ye Navvu Thoti Nannu pelchi Paripote Yella..

Panchadara Petti Ruddinattu
Manchi Thena Techi Addinattu
Draksha Pandu Teesi PindiNattu
Yenta Teepi Unnadey Ne Navvu Chuttu...

Veyyi Muggu sukkalettinattu Vinnamle
Poyyi Meeda Paalu Ponginattu Vinnamle
Puta Gokka Pandagochinattu
Yededo Avuthondey Nee Mida Vottu..

Sampake Sampake Sampake Nippulanti Navvuloki Dimpake
Ye Simpake Simpake Simpake Nallani Ratrine Simpake Rangutho Nimpake

Pilla Nuvu Leni Jeevitham
Breaku Leni Byk Ne Rayyimantu Tholadam
hey Pilla Nuvu Leni Jeevitham
Tracku Leni Train Mida Kuyyumantu yelladam...

Okka Jaanadantha Cuppu Kosam
Pedda World Cuppu Jaruguthaadi
Nee Navvulunna Lippu Kosam
Chinna WorldWar JariGina Thappu Lede...

Konni Vela Kotla Appu Kosam
Kaapu Kasi Unnadanta Desam
Okka Navvunanta Ivvu Papam
Danni Ammukunte Appu Baadha Tapputadey...

Kottina Kottina Kottina Gundelona Daagi Unna Dappuni
Raasina Raasina Raasina Navvu Pi Yevaru Rayani Mastu Mastu Paatani

Pilla Nuvu Leni Jeevitham
Tadu Leni Bongaranni Girrumantu thippadam
hey Pilla Nuvu Leni Jeevitham
Nune Lonchi Vaana Loki JaariPadda Appadam...
Ye Pillaa..

దేవుడు చేసిన మనుషులు ..... ఎందుకు చేసాడో దేవుడికే తెలియాలి

పూరీ, రవితేజ కాంబినేషన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్. దానికి కారణం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్,అమ్మా నాన్న తమిళ అమ్మాయి,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం వంటి ఘన విజయం సాధించిన సినిమాలు వీరి ఖాతాలో ఉండటం. అయితే ఈ సారి ఈ చిత్రానికి అంత క్రేజ్ క్రియేట్ కాలేదు. రవితేజ వరస ప్లాపుల్లో ఉండటం, పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో కథే లేదని రిలీజ్కు ముందుగానే ప్రకటన చేయటం వంటివి కారణాలు అయ్యాయి. అయినా స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ ఎఫెక్టుతో ఓపినింగ్స్ బాగున్నా దాన్ని నిలబెట్టుకునే పరిస్ధితి కనపడటం లేదు. కథే లేని సినిమా అని పూరి చెప్పారు కానీ అసలు ఏమీ లేని సినిమా అని ఫీలయ్యే స్ధితి వచ్చింది. 

నటీనటులు: రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్‌ వెంకట్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు,
సంగీతం: రఘు కుంచె,
పాటలు: భాస్క రభట్ల,
ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌,
ఫైట్స్‌: విజయ్‌,
డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌,
సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,
సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌,
ప్రొడక్షన్‌ డిజెనర్‌: చిన్నా,
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌
కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
విడుదల:ఆగస్టు 15,2012

ఓ రోజు వైకుంఠంలో విష్ణు మూర్తి(బ్రహ్మానందం)ని లక్ష్మి దేవి(కోవై సరళ)ని ఏదన్నా కథ చెప్పమని అడిగితే... ఆయన 'దేవుడు చేసిన మనుషులు' కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఆ కథలో ఇండియాలో ఉండే రవి (రవితేజ) సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతనికి దైవం నిర్ణయించిన జోడి ఇలియానా (ఇలియానా). ఆమె బ్యాంకాక్ లో డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఎమ్.ఎస్ నారాయణ(పనిలేని పాపన్న) అరటిపండు తిని తొక్క పారేయంటంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ అరటిపండు ఎఫెక్టుతో అనుకోకుండా ఎస్సై సుబ్బరాజు(సుబ్బరాజు) బ్యాంకాక్ డాన్ ప్రకాష్‌ (ప్రకాష్‌రాజ్‌) అనుచరుడుని చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ నుంచి ప్రాణం ముప్పు ఉన్న సుబ్బరాజు.. సెటిల్ మెంట్ రవి ద్వారా..ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకోవటాడు. దాంతో రవి.. బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకుంటాడు. బ్యాంకాక్ వెళ్లిన రవి అక్కడ ఇలియానాని ఎలా కలుసుకున్నాడు... ప్రకాష్ ని ఎలా డీల్ చేసాడన్నది ఫస్టాఫ్. సెకండాఫ్ కి వస్తే... ఎమ్.ఎస్ నారాయణం తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది. అదేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి.. అప్పుడు అనుమానాలు ఉండవు అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది... నిజానికి ఆ విషయం పూరీ జగన్నాధ్ ముందే చెప్పి హెచ్చరించకపోయినా చెప్పకపోయినా సినిమా చూస్తున్న ప్రేక్షకులు దేముడ్ని ఉన్నాడని నమ్మి తలుచుకోవటం మానరు. వాస్తవానికి Sliding Doors (1998), Run Lola Run (1998) చిత్రాల ప్రేరణతో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్క్రీన్ ప్లే మీద నడిచేది..అంతేకానీ హీరో,హీరోయిన్,విలన్ మధ్య నడిచే కథ కాదు. కానీ పూరి జగన్నాధ్ ఈ కథకు ఓ స్టార్ హీరోని, హీరోయిన్ ని తీసుకురావటంతో ప్రేక్షకుడు వాళ్లను ఫాలో అయ్యి ఈ స్క్రీన్ ప్లేని ఎంజాయ్ చేయటం కష్టమనిపిస్తుంది. ఎందుకంటే కథలో హీరో చేయటానికి ఏమీ ఉండదు. పైనున్నవాడు(బ్రహ్మానందం)ఎలా నడిపితే అలా నడుస్తుంది అన్న ధోరణిలో నడుస్తుంది. అందులోనూ ఈ కథా బ్రహ్మ పూరీనే కాబట్టి హీరోని వదిలేసి తనకు నచ్చనట్లు నడిపేసి ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టాడు. అయినా పూరీ జగన్నాధ్ మొదటి నుంచీ ఈ చిత్రంలో కథ లేదు అని చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. చెప్పినా వినకుండా నమ్మి సినిమాకి వెళ్లిన వారిదే తప్పు అనిపిస్తుంది. ఈ కథలో విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ ని మతిమరుపు డాన్ గా చూపెట్టి నవ్వులు పూయించాలనుకున్నారు కానీ అలా చేయటంతో కథలో ఇంటెన్సిటీ తగ్గటం వల్ల ఒరిగిందేమి లేదు. అంతేగాక విలన్ బలహీనడు అవటంతో... హీరోకి ఎక్కడా కాంప్లిక్ట్ కాని,సమస్యగానీ లేకుండా నడిచిపోతూంటుంది.

ఇక రెగ్యులర్ గా బ్రహ్మానందం,అలీ మధ్యన జరిగే కామెడీ పూరీ సినిమాల్లో హెలెట్ అవుతూంటుంది. అయితే ఈ సినిమాలో అదీ మైనస్ అయ్యింది. ఎప్పుడో పూర్వకాలం నాటి... దురదృష్ణం మన వెంట ఉంటే లక్ష్మి దేవి కూడా ఏమీ చేయలేదనే కథను ఎడాప్ట్ చేసారు... కానీ అది పండలేదు. రవితేజ మ్యానరిజంస్,డైలాగ్ డెలవరీ బోర్ కొట్టే స్ధితికి చేరుకున్నట్లు ఈ సినిమా గుర్తు చేస్తుంది. అలాగే చిత్రంగా ఇందులో పూరీ మార్కు డైలాగులు కూడా పెద్దగా లేవు.. ఉన్న కొద్దీ పేలలేదు. ఇలియానా ... జులాయి సినిమాలో చెప్పినట్లు ఈ సినిమాలో కూడా.. కరవు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఉండటంతో ఆమె ప్లస్ కాలేకపోయింది. ఆడియో పరంగా రెండు పాటలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా సుబ్బలక్ష్మి పాట హైలెట్ అయ్యింది. పాటలకు కూడా ప్లేస్ మెంట్ లేకపోవటంతో క్లైమాక్స్ అయిపోయాక శుభం కార్డుతో పాట పెట్టడం అనేది ఈ సినిమాలోనే కనపడుతుంది. ఎడిటింగ్,కెమెరా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు పరంగా పెద్దగా ఏమీ లేదు..చుట్టేసినట్లు కనపడుతుంది.
ఫైనల్ గా.. ఈ సినిమాలో చెప్పినట్లు తొక్క మీద జారిపడితే ఏమౌతుంది... జారిపడకపోతే ఏమౌంతుంది.. అన్నట్లుగా... కథ ఉంటే సినిమాలు ఎలా ఉంటాయి... కథ లేకపోతే ఎలా ఉంటాయి అన్నదానకి ఈ సినిమాని.. పూరి గత సినమాలను పోల్చుకోవచ్చు.