Pages

Monday 10 September 2012

సెప్టెంబర్ 28న రెబెల్ విడుదల?



 డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి రెండు వరుస విజయాల తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా "రెబెల్". అందువల్ల ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా అందరికి మంచి అంచనాలున్నాయి.  డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా లతో క్లాసు ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్ ఇప్పుడు మాస్ అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రం మొదట సంక్రాంతి బరిలో ఉంటుందని అందరు అనుకున్నారు కాని వివిధ కారణాల వాళ్ళ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా నిర్మాతలు విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తున్నాటుగా ప్రకటించారు. రెబెల్ పాటలు ఈ నెల 14న హైదరాబాద్ శిల్ప కళావేదిక లో అందరి సమక్షంలో విడుదల చేయబోతున్నట్లుగా గా కూడా ప్రకటించారు.

ఈ చిత్రం లో ప్రభాస్ సరసన తమన్నా , దీక్షా సేథ్ హీరోయిన్ లు గ నటించారు. ఈ చిత్రానికి సంగీతం,దర్శకత్వం  లారెన్స్  చేసాడు. నిర్మాతలు : J.పుల్లా రావు, J.భగవాన్.

0 comments:

Post a Comment